ఒక రోజు ముందే నీట్ పేపర్ లీక్ అయ్యింది : అరెస్ట్ అయినోళ్లు ఒప్పేసుకున్నారు..!

ఒక రోజు ముందే నీట్ పేపర్ లీక్ అయ్యింది : అరెస్ట్ అయినోళ్లు ఒప్పేసుకున్నారు..!

నీట్ ఎగ్జామ్ 2024 పేపర్ లీక్ అయినట్లు కన్ఫామ్ అయ్యింది... ఈ విషయాన్ని అరెస్ట్ అయిన నలుగురు ఒప్పుకున్నారు.. పోలీస్ విచారణలో ఈ విషయం వెలుగులోకి రావటంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

నీట్ పేపర్ లీక్ కేసులో  అభిలాషి అనురాగ్ యాదవ్, దానాపూర్ మునిసిపల్ కౌన్సిల్‌కు చెందిన జూనియర్ ఇంజనీర్ సికందర్ యాదవ్, మరో ఇద్దరు - నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ లను బీహార్ పోలీసులు  అరెస్ట్  చేసిన సంగతి తెలిసిందే.  పరీక్షకు ముందు రోజు రాత్రే సమాధానాలతో సహా పేపర్ తమ చేతికి వచ్చినట్టు అనురాగ్ యాదవ్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు.  పరీక్ష ముందు రోజే తమకు ప్రశ్నాపత్రం వచ్చింది, సమాధానాలు గుర్తుపెట్టుకున్నాం. మరుసటి రోజు ఎగ్జామ్ లో అవే ప్రశ్నలు వచ్చాయి. ఎగ్జామ్ తర్వాత మమ్మల్ని  పోలీసుల  అరెస్ట్ చేశారని నిజం ఒప్పుకున్నారు .

 నీట్ ప్రశ్నాపత్రానికి ఒక్కొక్కరిక రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని అమిత్ ఆనంద్, నితీష్ తనతో చెప్పారని  సికందర్ యాదవెందు ఆరోపించారు. జూన్ 4న రాత్రి తమకు పేపర్ అందిందని ఆన్సర్లు బట్టిపట్టి మరుసటి రోజు ఎగ్జామ్ రాసినట్లు చెప్పాడు. 

మరో వైపు  వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​ ఎగ్జాం వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థతో ఎంక్వైరీకి నో చెప్పింది. అలాగే, నీట్​ –2024 కౌన్సిలింగ్​ను నిలిపివేయడానికి నిరాకరించింది. ఈ వ్యవహారంపై దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్​ విక్రమ్​ నాథ్​, జస్టిస్​ సందీప్​ మెహతాతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్టీఏ)కి నోటీసులు జారీచేసింది. దీనిపై రెండు వారాల్లోగావివరణ ఇవ్వాలని ఏజెన్సీని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది.