ఫంక్షన్‌కి పిలిచి స్టూడెంట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్

ఫంక్షన్‌కి పిలిచి స్టూడెంట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్

ఇంట్లో ఫంక్షన్ ఉందని స్టూడెంట్‌ని ఇంటికి పిలిచి ఓ లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మాదాపూర్‌లోని చంద్రనాయక్ తండాలో జరిగింది. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన బాధిత యువతి రాంనగర్‌లోని సన్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం కళాశాలలో చదువుతోంది. అదే కళాశాలలో కళ్యాణ్ వర్మ వైస్ ప్రిన్సిపల్ మరియు లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కళ్యాణ్ వర్మ జనవరి 24న తమ ఇంట్లో ఫంక్షన్ ఉందని.. ఆ ఫంక్షన్‌కు రావాలని యువతిని ఆహ్వానించాడు. దాంతో యువతి ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత కళ్యాణ్ వర్మ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సదరు స్టూడెంట్ ఈ నెల 9న మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు

లోకేష్ సర్పంచ్‌గా గెలిస్తే రాష్ట్రం విడిచి వెళ్లిపోతా..

స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు

ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ కనీస ధర రూ. 20 లక్షలే