తినండి, తాగండి.. వ్యాక్సిన్​ వేసుకోండి..

తినండి, తాగండి.. వ్యాక్సిన్​ వేసుకోండి..
  • టీకా​పై అపోహలు వీడండి
  • కోల్​బెల్ట్​ ఏరియాల్లో వైరస్​ ప్రభావం ఎక్కువ 
  • ఈ మూడు నెలలు  అలర్ట్​గా ఉండండి
  • 2022 జనవరి నాటికి  స్టేట్​లో జీరో కోవిడ్​ కేసులు
  • స్టేట్​ హెల్త్​  డైరెక్టర్​ శ్రీనివాసరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ‘ఏ ఫుడ్​ అయినా తినండి..మందు అలవాటు ఉన్నా ఓకే..వ్యాక్సిన్​ వేసుకోవచ్చు. నేనైతే వ్యాక్సిన్​ వేసుకున్న తెల్లవారే ఒక అకేషన్​ ఉండడంతో లిక్కర్​ తీసుకున్నా. ఏం టెన్షన్​ పడాల్సిన పని లేదు ’ అని  స్టేట్​ హెల్త్​  డైరెక్టర్​ డాక్టర్ ​జి. శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్​లో ప్రజాప్రతినిధులు, హెల్త్​, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్​ డిపార్ట్​మెంట్లతో బుధవారం నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. రక రకాల భయాలతో కొంత మంది వ్యాక్సిన్​ వేసుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. ‘కరోనా టీకా వేసుకుంటే మటన్, చికెన్​ తినొద్దు. మద్యం తాగొద్దు అని అనుకుంటున్నారు. ఇలాంటిదేమీ లేదు. ’ అని అన్నారు. ఇప్పుడు వరుస పండుగలు ఉన్నాయని మన తెలంగాణలో సంస్కృతిలో మందు, మాంసం భాగమని, కాబట్టి వ్యాక్సిన్​ వేసుకుని కూడా ఎప్పుడూ చేసుకున్నట్టే పండుగలు చేసుకోవచ్చన్నారు.  వ్యాక్సిన్​ వేసుకున్న తరువాత వైరస్​ సోకితే చావు నుంచి తప్పించుకోవచ్చన్నారు. 2022 జనవరి నాటికి రాష్ట్రంలో కొవిడ్ ​కేసులు జీరోకు చేరేలా కృషి  చేస్తున్నామన్నారు. సింగరేణి కోల్​బెల్ట్​ ప్రాంతాల్లో వైరస్​ ప్రభావం కొంత ఎక్కువగా ఉందన్నారు. 
2 నుంచి 18 ఏండ్ల లోపు వారికి త్వరలో టీకా
2 నుంచి18 ఏండ్ల లోపు ఏజ్​ఉన్నవారు స్టేట్​లో 1.20 కోట్ల మంది ఉన్నారని, వీరందరికీ వ్యాక్సిన్​ వేసేందుకు ప్లాన్​ చేస్తున్నామని హెల్త్​ డైరెక్టర్​ అన్నారు. సెకండ్ ​డోస్ వేసుకోవాల్సిన వాళ్లు 61వేల మంది ఉన్నారని, వీరంతా ముందుకు వచ్చి టీకా వేసుకోవాలన్నారు. ఈ నెలతో పాటు నవంబర్,​డిసెంబర్​ నెలల్లో పండుగలు ఉన్న నేపథ్యంలో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, కలెక్టర్​ అనుదీప్, ​జడ్పీ వైస్​ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​, మున్సిపల్​ చైర్​ పర్సన్​ కాపు సీతాలక్ష్మి, హెల్త్​ డిపార్ట్​మెంట్​ఆఫీసర్లు పాల్గొన్నారు. తర్వాత కొత్తగూడెం క్లబ్​ ఆవరణలో జిల్లాకు ఎలాట్​ చేసిన 20 వ్యాక్సిన్​​మొబైల్​వెహికిల్స్​ను ఎమ్మెల్యే, హెల్త్​ డైరెక్టర్​, కలెక్టర్​ 
ప్రారంభించారు.  
ఆళ్లపల్లి డాక్టర్​పై ఆగ్రహం 
తర్వాత హెల్త్​ డిపార్ట్​మెంట్​ఆఫీసర్లు, స్టాఫ్, కలెక్టర్​ తో కలిసి హెల్త్ డైరెక్టర్​ రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. దీపావళి నాటికి జిల్లాలో 100  శాతం వ్యాక్సినేషన్​ పూర్తి కావాలన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల వివరాలను తాను చెప్పగలుగుతానని, కానీ మీ పీహెచ్​సీ పరిధిలో వ్యాక్సినేషన్​ వివరాలు సరిగ్గా చెప్పలేకపోతే ఎలా అని ఆళ్లపల్లి డాక్టర్​ సాగర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్​ అనుదీప్​ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో టీకాలు వేసేందుకు ఆర్బీఎస్​కే వెహికిల్స్​ను ఉపయోగించుకోవాలన్నారు. టీకాలు వేసుకున్న వారి ఇండ్లకు స్టిక్కర్​ అంటించాలన్నారు. తప్పనిసరిగా టార్గెట్ పూర్తి చేయాలన్నారు. డీఎంహెచ్​ఓ డాక్టర్​ శిరీష, హాస్పిటల్స్​కో ఆర్డినేటర్​డాక్టర్​ముక్కంటేశ్వర రావు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్​నాగేంద్రప్రసాద్​, డాక్టర్​ చేతన్​, డాక్టర్​ సుజాత, డాక్టర్​ సుకృత పాల్గొన్నారు.