
న్యూఢిల్లీ: టీవీ షోలో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు పడ్డ టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా , లోకేశ్ రాహుల్ ఇప్పుడు ఆటలో దూసుకెళ్తున్నారు. ఆ ఎపిసోడ్ తర్వాత ఇద్దరిలో ఎంతో మార్పు వచ్చిం ది. జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్ లోనూ సత్తా చాటుతున్నారు. వరల్డ్ కప్ టీమ్ లోకూడా చోటు దక్కించుకున్నారు. మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయిన ఈ ఇద్దరు.. టీవీ షో వివాదం తర్వాత మరింత దగ్గరయ్యారు. గురువారం తన పుట్టిన రోజు జరుపుకున్న లోకేశ్ రాహుల్ ఢిల్లీలో సహచర ఆటగాళ్లకుపార్టీ ఇచ్చా డు. అన్న క్రునాల్ పాండ్యా , అక్షర్ పటేల్ , రిషబ్ పంత్ తో కలిసి ఈ పార్టీలో పాల్గొ న్న హార్దిక్ సందడి చేశాడు. రాహుల్ తోదిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్‌చేశాడు. దానికి ‘ఏది ఏమైనా ఈ జీవితానికి మనది అన్నదమ్ముల అనుబంధం. హ్యాపీ బర్త్ డే లోకేశ్ . ఈ ఏడాది మనదే కావాలి’ అని క్యాప్షన్ ఇచ్చా డు.