
పురుగులమందు తాగాడు పరకాల, వెలుగు: సామాన్య ప్రజలు వైద్య సేవలు పొందటంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని పేర్కొంటూ ఓ వ్యక్తి ముఖ్యమంత్రికి లేఖ రాసి ఆత్మహత్యా యత్నం చేసుకున్న సంఘటన వరంగల్రూరల్ జిల్లా నడికూడ మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం… నడికూడ మండల కేంద్రానికి చెందిన బుర్ర నరేష్ నడికూడ మండలంలో వెయ్యి పడకల హాస్పిటల్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ గత నెల 19న గ్రామంలో నిరాహారదీక్ష చేయడానికి ప్రయత్నించాడు. ఎన్నికల కోడ్ఉందని, ఎన్నికల కోడ్ ముగియగానే దీక్ష చేపట్టవచ్చని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి గ్రామంలో పలువురిని కలిసి సమస్యలపై కలిసి పోరాడదామని చెప్పడంతో పాటు ఈ నెల 5న తిరిగి నిరహార దీక్ష చేపట్టేందుకు సన్నాహాలు చేశారు. విద్య, వైద్యం విషయంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు అందడం లేదని, సామాన్య ప్రజలకు ఆయా సేవలు అందే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకున్నా డు. గమనించిన కుటుంబ సభ్యులు పరకాల పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా డాక్టర్లు చికిత్స చేస్తున్నారు.