తిరుమలగిరిలో  లైబ్రరీ ప్రారంభం

తిరుమలగిరిలో  లైబ్రరీ ప్రారంభం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ తిరుమలగిరిలో రూ. 1.50 కోట్లతో నిర్మించిన అత్యాధునిక లైబ్రరీని ఎమ్మెల్యే శ్రీగణేశ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్​తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ, నిరుద్యోగుల కోసం వరుస నోటిఫికేషన్లు ఇస్తోందన్నారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన ప్రామాణిక పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.