ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్లకు కమీషన్ విధానాన్ని రద్దు చేసి, బేసిక్ సాలరీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందలాది మంది సర్వేయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్, శేఖర్ మాట్లాడుతూ.. లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థను ప్రారంభించి ఏడాది పూర్తయినా, దీనిపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టత, సరైన మార్గదర్శకాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు
