గద్వాల, వెలుగు: ఒకే వ్యక్తి రెండు కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నట్లు ఎర్రబెల్లి మండలం జింకలపల్లె గ్రామస్తులు సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కు ఫిర్యాదు చేశారు.
గ్రామానికి చెందిన రవి పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగంతో పాటు మిషన్ భగీరథ వర్కర్ గా పని చేస్తున్నాడని పేర్కొన్నారు. సెక్రటరీ, సర్పంచ్, మాజీ సర్పంచులు ఒకే వ్యక్తికి రెండు ఉద్యోగాలు ఇచ్చారని గ్రామస్తులు భాస్కర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, లక్ష్మన్న, రాముడు తెలిపారు.
