Virat Kohli: ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్‌లో విరాట్ ప్రస్తావన.. కోహ్లీపై DGMO లెఫ్టినెంట్ జనరల్ ప్రశంసలు

Virat Kohli: ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్‌లో విరాట్ ప్రస్తావన.. కోహ్లీపై DGMO లెఫ్టినెంట్ జనరల్ ప్రశంసలు

ఆపరేషన్ సిందూర్‌పై మూడు సర్వీసుల డీజీఎంఓల విలేకరుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో భారత సైన్యం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ విరాట్ కోహ్లీ గురించి స్పందించారు. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కెరీర్ పై  ప్రశసంలు కురిపించారు. విరాట్ కోహ్లీ తనకు ఇష్టమైన క్రికెటర్ అని అన్నారు. "ఈ రోజు నేను క్రికెట్ గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడనే వార్త విన్నాను. చాలా మంది భారతీయుల మాదిరిగానే అతను కూడా నా అభిమాన క్రికెటర్". అని అయన అన్నారు. 

సోమవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో కోహ్లీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం వైరల్ గా మారుతోంది. ఈ సందర్భంగా ఆ సీనియర్ కమాండర్ 50 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ సిరీస్‌ను గుర్తు చేసుకున్నారు.    "అది 1970ల కాలం  అనుకుంటున్నాను. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రసిద్ధ యాషెస్ సిరీస్ జరిగింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లే ధాటికి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. 1970కాలంలో నేను స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు.. యాషెస్ సిరీస్ సమయంలో ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్లు జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లీ చాలా క్రేజ్ ఉండేది". అని చెప్పారు. 

ALSO READ | యుద్ధం అంటే రొమాంటిక్గా ఉండదు .. బాలీవుడ్ సినిమా అంతకన్నా కాదు:ఆర్మీ మాజీ చీఫ్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్‌ కొహ్లీ టెస్ట్ క్రికెట్ కు సోమవారం (మే 12) రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ లో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్‌లో తాను తొలిసారి బ్యాగీ బ్లూ డ్రెస్ ధరించి 14 సంవత్సరాలు అయిందని, నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ నన్ను ఈ ప్రయాణంలో తీసుకెళ్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని కోహ్లీ పోస్ట్ చేశాడు. 

అద్భుతమైన ఫిట్ నెస్ ఉన్న 36 ఏళ్ళ కోహ్లీకి మరో మూడు నుంచి నాలుగేళ్లు ఈజీగా టెస్ట్ క్రికెట్ ఆడతారని భావించారు. కోహ్లీ మాత్రం అందరికీ ఊహించని షాకిస్తూ త్వరగానే టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్.. ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపించనున్నాడు.