మంత్రాల చెరువులో మహిళా మృతదేహం లభ్యం

మంత్రాల చెరువులో  మహిళా మృతదేహం లభ్యం

ఎల్బీనగర్, వెలుగు: రెండు రోజుల క్రితం ఓ మహిళ అదృశ్యమవగా.. ఆమె మృతదేహం మీర్ పేట్ లోని మంత్రాల చెరువులో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బడంగ్‌‌పేట్ సమతా నగర్‌‌కు చెందిన మీసాల కమల(52) మానసిక సమస్యలతో బాధ పడుతోంది. గత ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 

కుటుంబసభ్యులు మీర్ పేట్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగళవారం మీర్ పేట్ మంత్రాల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వారు సంఘటన స్థలానికి చేరుకొని డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. మీసాల కమలగా అనుమానించి ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి గుర్తించారు. ఆమె ఎలా చనిపోయింది.. కారణాలు ఏమిటన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.