టిక్ టాక్.. లైఫ్ లాస్‌…

టిక్ టాక్.. లైఫ్ లాస్‌…

అది ఉద్యోగాలు ఊడగొడుతోంది .. పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతోంది .. చిన్నాపెద్దా అని లేకుండా అందరినీ బానిసలను చేసుకుంటోంది .. ఎంతో మంది ప్రాణాలూ తీస్తోంది .. జనాన్ని పిచ్చో ళ్లను చేస్తున్నది.. అదే టిక్ టాక్ యాప్. ఏదో సరదాగా
ఉందని మొదలుపెట్టి న చాలా మంది టిక్‌ టాక్ కు బానిసవుతున్నారు. ఆఫీసులు, ఇళ్లు, రోడ్లు ఎక్కడైనా సరే.. ఏదో వీడియో తీసి అప్ లోడ్ చేయడం.ఎన్ని వ్యూస్, లైకు లు వస్తున్నాయా అని చూడటం పెరి గిపోయింది . గంటలకు గంటలు మొబైల్లో నే గడపడం వల్ల అటూ టైం వేస్ట్​ కావడంతోపాటు ఇటు మానసికంగా, శారీరకంగానూ ఇబ్బందులు తెచ్చిపెడుతోం దని డాక్టర్లు హెచ్చరి స్తున్నారు కూడా.

డబ్ స్మాష్ తరహాలో ..
టిక్‌ టాక్‌ యాప్‌ డబ్‌ స్మాష్‌ మాదిరి ఉంటుంది .ఇందులో మ్యూజికల్ వీడియోస్ ఉంటాయి. ఆడియోలు, వీడియోలు కలుపుకొనే వెసులుబా టు ఉంటుంది . డబ్‌ స్మాష్‌ల తరహాలో సినిమా పాట ల కు డ్యాన్సు లు, యాక్షన్, మాటలు, హావాభావాలు కలిపి వీడియోలు చేయవచ్చు. 2016లో బైట్ డ్యాన్స్ అనే చైనీస్ ఐటీ కంపెనీ టిక్‌ టాక్‌ యాప్ ను రూపొందించింది . గతేడాదిగా విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది . వాట్సప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ పాపులారిటీని అధిగమించి ట్రెండింగ్ అయింది . పంచవ్యాప్తంగా టిక్ టాక్ వినియోగదారుల్లో అధిక శాతం ఇండియన్లే. టిక్ టాక్ మొత్తం కస్టమర్లలో భారత్ లోనే 39 శాతం మంది ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి . ఇటీవలి గణాంకాల ప్రకారం టిక్ టాక్ లో వీడియోలు చేస్తున్న ఇండియన్లలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాలకు చెంది న వారే ఉన్నట్టు తెలుస్తోంది . వివాదాలతోనే ముందుకు.. టిక్ టాక్‌ పై మొదటి నుం చీ వివాదాలున్నాయి .దీనిపై మోజు వికటిం చి దుష్పరిణామాలకు దారితీస్తోంది . అశ్లీల చిత్రాలు, మతపరమైన విధ్వంసాలు, హింసను ప్రేరేపించేలా కొందరు డియోలను
రూపొంది స్తున్నారు. కొం దరు అభ్యం తరకరంగా వీడియోలుగా తీసి షేర్ చేస్తూ లైకు లు, కామెంట్ల కోసం ఎగబడుతున్నారు. మొదట్లో కొం దరు మెచ్చుకోవడంతో ఫేమస్‌ అవుతున్నామని మరిన్ని వీడియోలు పెడుతున్నారు. టిక్ టాక్ లో సెలబ్రిటీలుగా మారిన వాళ్లలా అవుదామన్న ఉద్దేశంతో ఎలాంటి వీడియోలకైనా తెగిస్తున్నారు. ఏవేవో ఫీట్లు చేయబోయి ప్రాణాలూ తీసుకు న్నారు.  దాంతో టిక్ టాక్ ను నిషేధించాలని డిమాండ్ వచ్చింది . కొద్దికాలంపాటు ఆ యాప్ ను నిలిపివేశారు. కానీ ఆ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మళ్లీ అనుమతి వచ్చింది .

టిక్ టాక్ ను నిషేధించాలని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ప్రధాని మోడీకి ఫిర్యా దు చేసింది . టిక్ టాక్ యాప్ యూజర్ల డేటా ప్రైవసీపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి . మంచి కంటే చెడే ఎక్కు వ! షార్ట్ వీడియో మెసేజ్ యాప్ టిక్ టాక్ తో ప్రయోజనాల కంటే నష్టాలు, అనర్థా లే ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. కొంత మంది తమ నైపుణ్యాన్ని వెలికితీయడాని-
కి ఇది ఉపయోగపడుతోం దని చెబుతున్నారు. వేలకు వేలు ఖర్చుపెట్టి షార్ట్‌ ఫిలిం లు చేయలేని వారు ఒక చిన్న వీడియోతో క్రియేటివిటీని నిరూపించుకుంటున్నారు. అలా కొందరు సెలబ్రిటీలుఅయిపోయారు కూడా. కానీ టిక్ టాక్ లో అప్ లోడ్‌ చేసిన వీడియోలను కొం దరు దుర్వి నియోగం చేస్తున్నారు. మార్ఫింగ్‌ చేసి, అశ్లీల వీడియోలను రూపొంది స్తున్న ఘటనలూ ఉన్నాయి . దాం తో ఆ వీడియోలోని వ్యక్తు లు ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కర్నా టకలో ఓ యువతి ఇదే తరహాలో సూసైడ్‌ చేసుకుంది . ఇక వీడియోలకు కొం దరు ఆకతాయి లు అభ్యం తరకర కామెంట్లు వేధిం చడం వంటివీ జరుగుతున్నాయి .

ఫేమస్‌ అవుతుం డటంతో అడిక్ట్‌ అయితున్నరు
పాపులారి టీ కోసం యూత్ టిక్‌ టాక్ లో వీడియోలు పెడుతున్నారు. లైక్స్‌, వ్యూస్‌రావడంతో హ్యా పీగా ఫీలవుతున్నారు. ఫేమస్‌ అవుతున్నామని మరిన్ని వీడియోలు పెడుతూ అడిక్ట్‌ అవుతున్నారు. టీనేజర్లు అందులో ఉండే నెగిటివ్‌ యాస్పెక్ట్‌ చూడకుండా వీడియోలు అప్ లోడ్‌ చేస్తున్ నారు.
ఇలాంటి వీడియోలను అందరూ ఒకే కోణంలో చూడటం లేదు. కొందరు సెక్స్‌వల్‌ యాస్పెక్ట్ లో కూడా
చూస్తున్ నారు.

చిన్నా, పెద్దా అంతా బానిసలే..

ఆఫీసుల్లో , ఇళ్లలో , రోడ్ల మీదా వీడియోలు గంటల కొద్దీ టైం వేస్ట్ చేసుకుంటున్న యూత్
లైకులు, కామెంట్ల కోసం ప్రమాదకర ఫీట్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారెందరో..గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగుల టిక్ టాక్ లు వారిపై చర్యలు తీసుకుంటున్న అధికారులు టిక్ టాక్ తో చెడే
ఎక్కు వంటున్న డాక్టర్లు