అయ్యప్ప సన్నిధిలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు

అయ్యప్ప సన్నిధిలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు

కల్లూరు, వెలుగు : ఈనెల 13న తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం

పినపాక, అశ్వరావుపేట, ఎమ్మెల్యే లు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణతో పాటు టీఎస్​ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ మువ్వ విజయ బాబు, డిసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్యతో కలిసి మంత్రి అయ్యప్ప సన్నిధిలో పూజలు చేశారు.