మల్లాపూర్‌‌ తహసీల్‌ ఎదుట గ్రామస్తుల ఆందోళన

మల్లాపూర్‌‌ తహసీల్‌ ఎదుట గ్రామస్తుల ఆందోళన

మల్లాపూర్, వెలుగు:- భూ కబ్జాలపై ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు మల్లాపూర్‌‌ తహసీల్‌ ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 41లో బంచోన్ గుట్టను అదే గ్రామానికి చెందిన కొందరు కబ్జాకు యత్నిస్తున్నారు. దీనిపై గ్రామ వన సంరక్షణ సమితి కమిటీ సభ్యులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

అయినా అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు తహసీల్​ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వీర్‌‌సింగ్ గ్రామస్తులతో మాట్లాడి రీసర్వే చేయించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులు రవి , రమేశ్‌, శేఖర్, నర్సయ్య పాల్గొన్నారు.