
గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఎంఎస్ ఆర్జీ 1 ఏరియా ఉపాధ్యక్షుడు ఆకుల హరిణ్ కోరారు. బుధవారం జీడీకే 5 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్ట్ ఆవరణలో దుమ్ము లేవకుండా ట్యాంకర్ ద్వారా నీటిని చల్లించాలని, బేస్ వర్క్‌షాప్ వద్ద వెహికిల్స్ రిపేర్ చేస్తున్న చోట షెడ్లు నిర్మించాలని, ఉద్యోగులు సేదతీరే రూమ్‌ల వద్ద అదనంగా కూలర్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి పల్లె శ్రీనివాస్, కేంద్ర కమిటీ సభ్యుడు సీహెచ్ కృష్ణ మోహనరాజు, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ నీలం శ్రీనివాస్, మెడ రాంమూర్తి, బేస్ వర్క్‌షాప్ డెలిగేట్ అడ్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు.