ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు

ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్, వెలుగు: ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. సోమవారం నాటి తీవ్ర అల్పపీడనం మంగళవారం వాయు గుండంగా మారి ఒడిశా తీర ప్రాంతంలో భువనేశ్వర్ కు ఉత్తర ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైందని ప్రకటించింది. ఇది బుధవారం బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. ఆ ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చని స్పష్టం చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ మోస్తరు వానలు పడొచ్చని అంచనా వేసింది.