మూడు గంటల్లో వర్షాలు

మూడు గంటల్లో వర్షాలు

హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని  పలు జిల్లాలతో రాగల రెండు మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు  కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.  ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం,నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి,మెదక్ , వికారాబాద్ ,రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, జనగాం, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం ,మహబూబాబాద్, వరంగల్ ,కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి ,జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లోని పలు ఏరియాల్లో  తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.