రైతును కొట్టిన లైన్ మెన్

V6 Velugu Posted on Nov 29, 2021

యాదాద్రి భువనగిరి జిల్లా: అడ్డగుడూర్ మండలం బొడ్డుగూడెంలో లైన్ మెన్ రెచ్చిపోయాడు. వెంకన్న అనే విద్యుత్ అధికారి గ్రామానికి చెందిన రైతుపై చేయి చేసుకున్నాడు. ట్రాన్స్ ఫార్మర్ కి డబ్బులిచ్చినా పాతదే ఎందుకు పెట్టారని లైన్ మెన్ ను ప్రశ్నించారు రైతు. ఆగ్రహంతో రైతును కొట్టాడు లైన్ మెన్ వెంకన్న. తనను అకారణంగా కొట్టాడంటూ మోత్కుర్ విద్యుత్ కార్యాలయం దగ్గర రైతు ధర్నాకు దిగాడు. లైన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. 

Tagged farmer, Yadadri District, beating, , Linemen

Latest Videos

Subscribe Now

More News