కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ, యమాల్ హగ్!.. వీడియో వైరల్!

కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ, యమాల్ హగ్!.. వీడియో వైరల్!

Lionel Messi Emotional: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు తన అద్భుత ఆటతీరుతో అలరించిన దిగ్గజం లియోనెల్ మెస్సీ ఆఖరి ప్రపంచకప్ పయనం తీవ్ర నిరాశతో ముగిసింది. అమెరికాలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా 1–0 తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో భావోద్వేగ దృశ్యాలు ఫుట్‌బాల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.

స్టేడియంలోనే ఏడ్చేసిన మెస్సీ:  

39 ఏళ్ల వయసులో అర్జెంటీనాను ముందుండి నడిపించిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ, ఈ ఓటమిని తట్టుకోలేక మైదానంలోనే గుక్కపెట్టి ఏడ్చేశాడు. తన సహచర ఆటగాళ్లు రన్నరప్ మెడల్స్ అందుకుంటున్న సమయంలో మెస్సీ తన ఆవేదనను దాచుకోలేకపోయారు. కళ్లలో నుంచి నీళ్లు కారుతుండగా ఆయన నిస్సహాయంగా నిలబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానుల హృదయాలను తీవ్రంగా కలచివేసింది.

నీ కన్నీళ్లు మా కన్నీళ్లు కెప్టెన్.. ఏఎఫ్ఏ పోస్ట్: 

తీవ్రమైన బాధలో ఉన్న తమ గ్రేటెస్ట్ లీడర్‌కు అండగా నిలుస్తూ అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అత్యంత భావోద్వేగభరితమైన సందేశాన్ని విడుదల చేసింది. కెప్టెన్ కళ్లలో నుంచి వచ్చిన ప్రతి కన్నీటి చుక్క తమ కన్నీళ్లతో సమానమని పేర్కొంటూ స్పందించింది. కెప్టెన్, నీ కన్నీళ్లు మా కన్నీళ్లు.. మా జీవితాల్లో మర్చిపోలేని ఎన్నో గొప్ప సంతోషాలను నువ్వు మాకు అందించావు.. చివరి సెకను వరకు నువ్వు చూపిన అంకితభావానికి, మైదానంలో సృష్టించిన అద్భుతాలకు, నీ పోరాటానికి ధన్యవాదాలు.. నిన్ను మేము ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటామని అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ వెల్లడించింది. 

ALSO READ : సెలబ్రేషన్స్‌లో ట్రంప్‌ను పక్కకు నెట్టేసిన రోడ్రి?..

మెస్సీ, యమాల్ ఆత్మీయ ఆలింగనం!

మ్యాచ్ ముగిసిన వెంటనే అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ దగ్గరకి స్పెయిన్ యువ ఆటగాడు లామిన్ యమాల్ అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఈ హాగ్ వెనుక ఒక క్రేజీ ఫ్లాష్‌బ్యాక్ ఉంది. 2007లో జరిగిన ఒక యూనిసెఫ్ (UNICEF) ఛారిటీ ఫొటోషూట్‌లో అప్పట్లో యువ ఆటగాడిగా ఉన్న మెస్సీ, ఒక పసిబిడ్డను టబ్‌లో వేసి స్నానం చేయిస్తూ ఎత్తుకున్న ఫోటోలు ఈ మధ్యే సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలో ఉన్న పసి పిల్లాడే ఈ లామిన్ యమాల్. అప్పుడు మెస్సీ చేతుల్లో పెరిగిన అతడు, నేడు స్పెయిన్ తరఫున ప్రపంచకప్ విజేతగా నిలవడం.. ఓటమి బాధలోనూ మెస్సీ అతడి దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా అభినందించి కౌగిలించుకోవడం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.