కేకేఆర్‌లోకి ఫుట్ బాల్ స్టార్ మెస్సీ..?

కేకేఆర్‌లోకి ఫుట్ బాల్ స్టార్ మెస్సీ..?

న్యూఢిల్లీ : అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్ ‌మెస్సీ ఏంటి.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌లో చేరడమేంటి అని ఆశ్చర్యపోకండి. స్పానిష్‌ ఫుట్‌బాల్ క్లబ్‌ బార్సిలోనా ఎఫ్‌‌సీని మెస్సీ వీడడం దాదాపు ఖాయమైంది. దానితో ఇతర ఫుట్‌బాల్ క్ల‌బ్‌ లన్నీ అలెర్ట్‌‌ అయ్యాయి. మెస్సీని తమ టీమ్‌లోకి తీసు కోవాలని ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాయి. దీంతో మెస్సీ ఏ జట్టులో చేరతాడనే విషయం హాట్ ‌టాపిక్‌గా మారింది. అయితే, ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఫన్నీ ట్వీట్స్‌‌తో ఈ డిస్కషన్‌లో పాల్గొన్నాయి. మిస్టర్‌ మెస్సీ.. పర్పుల్‌ అండ్‌‌గోల్డ్‌‌ కలర్‌ జెర్సీ గురించి ఓసారి ఆలోచించండి అంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌(కేకేఆర్‌) ట్వీట్‌ చేసింది. కేకేఆర్ జెర్సీలో ఉన్న మెస్సీఫొటోను కూడా పోస్ట్‌ చేసింది. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ ‌‌అయితే ‘మేము మెస్సీ కోసం ప్రయత్నిస్తున్నామంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు’ అని ఓట్వీట్‌చేసి అందరినీ అట్రాక్ట్ ‌చేసింది.