
హైదరాబాద్ సిటీ, వెలుగు: దసరా నేపథ్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్ వాజ్ ఖాసీం ఈ నెల 15 నుంచి స్పెషల్‌డ్రైవ్ చేపట్టారు. ఎస్టీఎఫ్, డీటీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు, ఎక్సైజ్ టీమ్‌లు వారం రోజులుగా ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన1,04 మద్యం బాటిళ్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.68.16 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ నెల 30 వరకు డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు.