గొర్రెలకు ఆకులు తెంపడానికి వెళ్లి.. యాకుత్ పురా నాలాలో పడ్డ వ్యక్తి.. కాపాడిన స్థానిక కార్పొరేటర్

గొర్రెలకు ఆకులు తెంపడానికి వెళ్లి.. యాకుత్ పురా నాలాలో పడ్డ వ్యక్తి.. కాపాడిన స్థానిక కార్పొరేటర్

గొర్రెలకు మేతగా చెట్టుకొమ్మలను తీసుకురావడానికి వెళ్లి ఓ వ్యక్తి నాలాలో జారిపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అప్పటికే నాలా ఉృదృతంగా ప్రవహిస్తోంది. స్థానికులు,  స్థానిక కార్పొరేటర్ రెస్క్యూ చేసి  ఎట్టకేలకు అతడిన సేఫ్ గా రక్షించారు.  ఈ ఘటన  హైదరాబాద్ లోని పాతబస్తీ యాకుత్ పురాలో జరిగింది. 

 భారీ వర్షాలు పడుతున్న సమయంలో పాతబస్తి యాకుత్ పురా నాలా దగ్గర  గౌస్ అనే వ్యక్తి తన గొర్రెల కొసం ఆకులు తెంపడానికు వెళ్లాడు. ఉదృతంగా ప్రవహిస్తున్న నాలాలో జారిపడ్డాడు. స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసే నిచ్చెన , తాడు అందుకుని  నాలాలొ ఉన్న వ్యక్తిని బయటికి తీశారు. 

మరో వైపు హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో  వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.  మూడు రోజులు అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.