అర్ధరాత్రి చెత్త లారీలను అడ్డుకున్నారు

అర్ధరాత్రి చెత్త లారీలను అడ్డుకున్నారు

జవహర్ నగర్ డంప్ యార్డును తరలించాలె
అర్ధరాత్రి చెత్త లారీలను అడ్డుకున్న స్థానికులు.. నేడు ర్యాలీకి పిలుపు

హైదరాబాద్, వెలుగు: జవహర్ నగర్ డంప్ యార్డ్ నుంచి వస్తున్న కంపు భరించలేకపోతున్నామని గురువారం అర్ధరాత్రి స్థానికులు రోడ్డెక్కారు. చెత్తతో వస్తున్న లారీలను అడ్డుకున్నారు. యార్డును ఎత్తేయాలని 2.30గంటల వరకూ ఆందోళన చేశారు. వారం నుంచి రాత్రిళ్లు దుర్వాసన తీవ్రంగా వస్తోందని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  స్థానికుల ఆందోళనలతో డంపింగ్ యార్డు నిర్వహణ కాంట్రాక్ట్‌‌ దక్కించుకున్న రాంకీ సంస్థ క్యాపింగ్ చేసినా, దుర్వాసన వస్తూనే ఉంది. దాంతో యార్డును తరలించాలని తరచూ ఆందోళనలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ, పీసీబీ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో గురువారం అర్ధరాత్రి యార్డ్ కు వస్తున్న లారీలను దమ్మాయిగూడ చౌరస్తాలో అడ్డుకున్నారు. రాంకీ, పీసీబీ, జీహెచ్ఎంసీ అధికారులపై జవహర్ నగర్ పీఎస్ లో కంప్లయింట్ చేశారు. శుక్రవారం స్థానిక డీసీపీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట జేఏసీ చెప్తోంది. శనివారం ఉదయం 9 గంటలకు దమ్మాయిగూడ మున్సిపల్ ఆఫీస్ నుంచి చలో డంపింగ్ యార్డ్ ర్యాలీ నిర్వహించనున్నట్లు స్థానికులు తెలిపారు.

తరలిస్తరా..? మా ఇండ్లు కొంటరా?

డంపింగ్ యార్డుతో బతకలేపోతున్నాయని, ఇక్కడి నుంచి తరలించకపోతే ప్రభుత్వమే తమ ఇండ్లు కొనాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు గాలి ఆడక అస్వస్థతకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

బీజేపీ మద్దతు కోరిన స్థానికులు

తమ పోరాటానికి మద్దతును తెలపాలని శుక్రవారం స్థానిక బీజేపీ నేతలతో కలిసి ఆ పార్టీ స్టేట్ చీఫ్  బండి సంజయ్ ను కలిశారు. సమస్య తీవ్రతను వివరించారు.

మరిన్ని వార్తల కోసం

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు