ప్రియాంక ఇంటి దగ్గర ఉద్రిక్తత..మంత్రి సత్యవతిని అడ్డుకున్న స్థానికులు

ప్రియాంక ఇంటి దగ్గర ఉద్రిక్తత..మంత్రి సత్యవతిని అడ్డుకున్న స్థానికులు

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్ ను స్థానికులు అడ్డుకున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రియాంక ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు సకాలంలో స్పందించక పోవడంతోనే ప్రియాంక హత్య జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై మంత్రి సత్యవతి రాథోడ్ ను ప్రశ్నించడంతో…ఆమె సర్ధి చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా విన్పించుకోక పోగా…మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  దీంతో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రత్నించిన మంత్రి కాన్వాయ్ ను కూడా స్థానికులు అడ్డుకోవడంతో…కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. చివరకు పోలీసులు చొరవ తీసుకుని స్థానికులను అడ్డుకోవడంతో మంత్రి సత్యవతి రాథోడ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.