పద్మారావునగర్, వెలుగు: లాల్ బజార్ సమీప కంటోన్మెంట్ ఏడో వార్డులోని చిన్న కమేళా బస్తీలో వైన్స్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు సోమవారం ఆందోళన చేపట్టారు. వైన్స్ఏర్పాటు చేసే స్థలం స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ కు చెందినది కావడంతో కార్పొరేటర్ స్పందించాలని డిమాండ్ చేశారు.
వైన్ షాపు పెడితే ఇక్కడి విద్యార్థులు, చిన్నారులు, మహిళలు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. మరోచోటుకు మార్చాలన్నారు. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు.
