- తల్లకిందులుగా తపస్సు చేసినా మళ్లీ నువ్వు సీఎం కాలేవ్
- నీకిదే ఆఖరి టర్మ్
- ఎప్పుడు గోల్ కొట్టాలో మాకు బాగా తెలుసు
- జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తారో లేదో చూద్దాం
- డీలిమిటేషన్ తో మా పార్టీకే మేలు: మాజీ మంత్రి
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఎందుకు నాపై పోటీకి రేవంత్ రెడ్డినే రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో లాబీలో హరీశ్ రావు మీడియాతో చిట్ చాట్చేశారు. ‘
సిద్దిపేట కి సీఎం రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేస్తున్న. ఎవరో మంత్రి కావడం ఎందుకు? ఆయన్నే ఇక్కడికి రమ్మని చెబుతున్న. తల్లకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాడు. ఆయనకు ఇదే ఆఖరి టర్మ్. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ సీఎం కావటం ఖాయం. ఎప్పుడు గోల్ కొట్టాలో మాకు బాగా తెలుసు. మళ్లీ సీఎం అవుతానని రేవంత్ పగటి కలలు కంటున్నడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రైతులు.. ఇలా అన్ని వర్గాలను మోసం చేశాడు. డీ లిమిటేషన్ తో బీఆర్ఎస్కు మేలు జరుగుతుంది. కుటుంబ నియంత్రణ మంచిగా పాటించినందు కు దక్షిణాదికి ఆర్థికంగా, రాజకీయంగా నష్టమే. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో వస్తారో లేదో.. చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది' అని అన్నారు.
సభ మరో వారం పొడిగించాలి
'అసెంబ్లీ సమావేశాలను మరో వారం రోజులు పొడిగించాలి. అన్ని అంశాల పై చర్చ జరగాలి. సభసడుపుతున్న తీరు అసలు బాగాలేదు. క్వశ్చన్అవర్లో బీఆర్ఎస్ వేసిన ముఖ్యమైన ప్రశ్నలు సభలో చర్చకు రాకుండా చేస్తున్నారు. రెండున్నర ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య...16,978. ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించకుండా ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఇన్ని రోజులు మేము చెప్పిందే నిజం అయింది. 60 వేలు 70 వేలు ఇచ్చామని అన్ని అబద్ధాలు చెప్పారు' అని హరీశ్ రావు మండిపడ్డారు.
►ALSO READ | ఖమ్మం జిల్లాలో మాజీ సర్పంచ్ కిడ్నాప్..
