ఖమ్మం జిల్లాలో మాజీ సర్పంచ్ కిడ్నాప్..

ఖమ్మం జిల్లాలో మాజీ సర్పంచ్ కిడ్నాప్..

హైదరాబాద్: ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పండ్రేగుపల్లి గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్య క్షుడు పాము శిల్వరాజ్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇవాళ తెల్లవారు జామున వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. భూ వివాదాలే కిడ్నాపు కారణంగా భావిస్తున్నారు. 

కొందరు అశోక్ లేల్యాండ్ వాహనంలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని శిల్వరాజ్ భార్య స్వర్ణలత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ సర్పంచ్ కిడ్నాప్ వార్త విని గ్రామస్తులు భారీగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు.

►ALSO READ | అంజన్న సన్నిధిలో టెండ'రింగ్'.. కుమ్మక్కై బహిష్కరించిన వ్యాపారులు.. రద్దయిన వేలం