రేవంత్‌‌ పాలనలోనే నాణ్యమైన విద్య : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్

రేవంత్‌‌ పాలనలోనే నాణ్యమైన విద్య : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్

హైదరాబాద్‌‌, వెలుగు: సీఎం రేవంత్‌‌ రెడ్డి పాలనలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని, యువతకు ఉద్యోగ అవకా శాలు లభిస్తున్నాయని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌‌ అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత పదేండ్ల బీఆర్‌‌ఎస్‌‌ పాలనలో విద్యార్థులకు సరైన విద్య అందలేదని, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రెండున్నరేండ్ల రేవంత్‌‌ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆదర్శవంతమైన విద్యను అందించేందుకు యంగ్‌‌ ఇండియా రెసిడెన్షియల్‌‌ స్కూల్స్‌‌, తెలంగాణ పబ్లిక్‌‌ స్కూళ్లు, స్కిల్‌‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.