పెద్దపల్లిలో పెండింగ్ రైల్వే సమస్యలు పరిష్కరించండి..బెల్లంపల్లి, రామగుండం రైల్వే స్కూల్స్‌‌ను అప్‌‌గ్రేడ్ చేయాలి

పెద్దపల్లిలో పెండింగ్ రైల్వే సమస్యలు  పరిష్కరించండి..బెల్లంపల్లి, రామగుండం రైల్వే స్కూల్స్‌‌ను అప్‌‌గ్రేడ్ చేయాలి
  • రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్‌‌ కుమార్‌‌‌‌కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినతి
  • మంచిర్యాల, బెల్లంపల్లి, రేష్ని రోడ్ స్టేషన్లలో పలు ఎక్స్‌‌ప్రెస్‌‌ రైళ్లు ఆపాలి
  • అవసరమైన చోట ఆర్వోబీలు, ఆర్‌‌‌‌యూబీలు, ఎఫ్‌‌ఓబీలు నిర్మించాలి 
  • సమస్యలపై ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్‌‌ సతీశ్ కుమార్‌‌‌‌కు వినతి పత్రాలు ఇచ్చిన ఎంపీ

న్యూఢిల్లీ, వెలుగు:పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో చాలా కాలంగా పెండింగ్‌‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్​ కుమార్‌‌‌‌కు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌‌లోని ఆర్వోబీ/ఆర్‌‌యూబీ/ఎఫ్‌‌ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్‌‌లో ఉన్న పలు రైల్ హాల్టింగ్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని అభ్యర్థించారు. వీటితో పాటు బెల్లంపల్లి, రామగుండంలోని రైల్వే స్కూల్స్‌‌ను అప్‌‌గ్రేడ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్‌‌ను కలిసి ఆయా అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. 

దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో వర్షాకాలం నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పెండింగ్‌‌లో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ), రోడ్డు అండర్ బ్రిడ్జ్ (ఆర్‌‌‌‌యూబీ)/సబ్‌‌వే, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్‌‌ఓబీ) పనులను వేగవంతం చేయాలన్నారు. వర్షపు నీరు నిండి పలుచోట్ల లెవెల్ క్రాస్(ఎల్‌‌సీ) పనుల్లో జాప్యంతో పాటు స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. రక్షణ షెడ్లు, డ్రైనేజీ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరారు. 

తమ విజ్ఞప్తులపై చైర్మన్ సానుకూలంగా స్పందించారని, అధికారులతో ఆయా అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఉత్తర తెలంగాణలోని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్‌‌లో ఉన్న ట్రైన్ హాల్టింగ్ అంశాన్ని ఎంపీ వంశీకృష్ణ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు, సింగరేణి కార్మికులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రయాణికులకు రైల్వే సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రైలు హాల్టింగ్‌‌ స్టేషన్లు సరిపోవడం లేదని, తన నియోజకవర్గంలోని మరికొన్ని స్టేషన్లలో పలు రైళ్లను ఆపాలని కోరారు. 

రైల్వే స్కూల్స్‌‌ను అప్‌‌గ్రేడ్ చేయండి..

బెల్లంపల్లి, రామగుండంలోని రైల్వే స్కూల్స్‌‌ను అప్‌‌గ్రేడ్ చేయడంతో పాటు మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. రామగుండం, పెద్దపల్లి, చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 800 మంది రైల్వే ఉద్యోగులు ఉన్నప్పటికీ... ప్రస్తుతం రామగుండం-పెద్దపల్లి, -మంచిర్యాల ప్రాంతం మొత్తంలో రైల్వే ఆధ్వర్యంలో నడిచే ఒక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా లేదని చైర్మన్ దృష్టికి తెచ్చారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేకపోవడం వల్ల రైల్వే ఉద్యోగుల పిల్లలు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారని తెలిపారు.

 అలాగే, బెల్లంపల్లిలోని రైల్వే ఈపీసీ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే పనిచేస్తుందని, అందులో 1వ తరగతి నుంచి 5వ తరగతి క్లాసులు నిలిపివేశారని గుర్తుచేశారు. దీని ఫలితంగా రైల్వే ఉద్యోగులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్‌‌లో చేర్పిస్తున్నారని వెల్లడించారు. రామగుండంలో ఉన్న రైల్వే పీసీ పాఠశాల 2002–03 విద్యా సంవత్సరం నుంచి మూసివేశానరని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. 

పెండింగ్‌‌లో ఉన్న ఆర్‌‌‌‌యూబీ/సబ్‌‌వే పనులు..

  • LC నెం.33 – హరిపురం గ్రామం
  • వంతెన నెం.74A – ఓదెలగేట్ నెం.1A & 2A - మల్యాలపల్లి & బద్రిపల్లి, రామగుండం
  • హైటెక్ సిటీ నుంచి రాజీవ్​నగర్, మంచిర్యాల 
  • నార్లాపూర్ నుంచి అందుగులపేట, మందమర్రి
  • వంతెన సంఖ్య 176 - – రాంనగర్, బెల్లంపల్లి.

ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్‌‌ఓబీ) పనులు..

  • 1. LC నెం.56 –- హమలేవాడ, మంచిర్యాల
  • 2. మందమర్రి రైల్వే స్టేషన్‌‌లో ఎఫ్‌‌ఓబీ పొడిగింపు
  • 3. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌‌లో కొత్త ఎఫ్‌‌ఓబీ 
  • 4. రెచ్నీ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద ఎఫ్‌‌ఓబీ పొడిగింపు

మరిన్ని అభ్యర్థనలు...

  • 1. ఉత్తర తెలంగాణ, హైదరాబాద్‌‌ల మధ్య కనెక్టివిటీ కోసం... సిర్పూర్‌‌ -కాగజ్‌‌నగర్ – -హైదరాబాద్ 
  • సూపర్‌‌ఫాస్ట్ ఎక్స్‌‌ప్రెస్‌‌ను తిరిగి ప్రవేశపెట్టాలి.
  • 2. హైదరాబాద్‌‌కు ప్రయాణించే ప్రయాణికులకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి రైలు నెం.17036 (బల్హర్షా-- – కాజీపేట ప్యాసింజర్)ను సికింద్రాబాద్ వరకు పొడిగించాలి

రైల్ హాల్టింగ్ ప్రతిపాదనలు:

1. రైలు నెం. 12625/12626 కేరళ ఎక్స్‌‌ప్రెస్ -– మంచిర్యాల
2. రైలు నెం. 20625/20626 చెన్నై సెంట్రల్ -భగత్‌‌కి కోఠి ఎక్స్‌‌ప్రెస్ – మంచిర్యాల
3. రైలు నెం. 22737/22738 సికింద్రాబాద్ -హిసార్ సూపర్‌‌ఫాస్ట్ ఎక్స్‌‌ప్రెస్ – మంచిర్యాల
4. రైలు నం. 17003/17004 రామగిరి ఎక్స్‌‌ప్రెస్ – రెచ్ని రోడ్
5. రైలు నం. 17033/17034 సింగరేణి ఎక్స్‌‌ప్రెస్ – -రెచ్ని రోడ్
6. రైలు నం. 12757/12758 సిర్పూర్ -కాగజ్‌‌నగర్- సికింద్రాబాద్ ఎక్స్‌‌ప్రెస్ – రెచ్ని రోడ్.


రేచ్నీ రోడ్ రైల్వే స్టేషన్‌‌లో ట్రైన్ హాల్ట్‌‌ల అభ్యర్థనలు..

 

  • సింగరేణి ఎక్స్‌‌ప్రెస్ (17011/17012), రామ్‌‌గిరి ఎక్స్‌‌ప్రెస్ (17027/17028)