- ‘టాప్ గన్’ కోర్సు పూర్తి చేసిన తొలి మహిళా ఫైటర్ పైలట్
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ ఫైటర్ కంబాట్ లీడర్ కోర్సును పూర్తి చేసిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించారు. గ్వాలియర్‌లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కంబాట్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో 20 వారాలపాటు నిర్వహించే ఈ శిక్షణను ఐఏఎఫ్‌లో అత్యంత కఠినమైన అడ్వాన్స్‌డ్ కంబాట్ కోర్సుల్లో ఒకటిగా పరిగణిస్తారు. బిహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన భావనా కాంత్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. 2016 లో అవని, మోహనా సింగ్‌తో కలిసి దేశ తొలి మహిళా ఫైటర్ పైలట్ల బృందంలో చేరారు.
