వరంగల్లో బంగారం కొంటున్నారా..? ఈ విషయం తెలిసిందో.. లేదో.. మరి !

వరంగల్లో బంగారం కొంటున్నారా..? ఈ విషయం తెలిసిందో.. లేదో.. మరి !
  • గోల్డ్ షాప్లో బీఐఎస్ దాడులు
  • రూ.10 కోట్ల విలువైన 7.875 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం

వరంగల్‍, వెలుగు: వరంగల్లోని ఓ ప్రముఖ గోల్డ్ షాప్‍పై మంగళవారం బీఐఎస్‍(బ్యూరో ఆఫ్‍ ఇండియన్‍ స్టాండర్డ్స్) హైదరాబాద్ బ్రాంచ్​ అధికారులు దాడులు నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్లు కె.కవిన్, విజయరాజ్ బర్బర్ టీమ్​ తనిఖీలు నిర్వహించి షాపులో బీఐఎస్ హాల్‌‌‌‌‌‌‌‌మార్క్ లేని బంగారు ఆభరణాలను గుర్తించారు.

7.875 కిలోల హాల్‌‌‌‌‌‌‌‌మార్క్ లేని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. హాల్‌‌‌‌‌‌‌‌ మార్కింగ్ దుర్వినియోగం, హెచ్‌‌‌‌‌‌‌‌యూఐడీ లేని బంగారు ఆభరణాల విక్రయాలను గుర్తిస్తే ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.