సీఎంను కలిస్తే పార్టీ మారినట్టేనా?: మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

సీఎంను కలిస్తే పార్టీ మారినట్టేనా?: మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  • కొందరు ఓపెన్ గానే రేవంత్ ను పొగుడ్తున్నా.. నన్నే టార్గెట్ చేస్తుండ్రు
  • సొంతపార్టీ నేతలే నాపై మండిపడ్తున్నరు


హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కేవలం మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమేనని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. 'పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారం అసత్యం. మా పార్టీలోనే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు అభివృద్ధి కోసం సీఎం వద్దకు వెళ్తున్నా రు.. కొందరు బహిరంగంగానే ఆయనను పొగుడుతున్నారు. కానీ, పార్టీ నేతలకు ఈ విషయం కనిపించడం లేదు. వాళ్లపై జరగని చర్చ, నాపైనే ఎందుకు? నన్నే లక్ష్యంగా చేసు కుంటున్నరు. నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారు. 

మల్కాజిగిరి నియోజకవర్గం కోసం 210 కోట్ల ఫ్లై ఓవర్ పనులకు, 910 కోట్లు రింగ్ రోడ్డుకు నిధులు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రతిసారీ ఫొటో బయట పెడుతాను. ఇది మా పార్టీలో కొంత మందికి మండుతుంది. మా ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉందంటే మా అత్తమ్మ కారణం. ఆమె సలహాలు సూచనలతో నే ఈ స్థాయిలో ఉన్నాం. మా మామ మల్లా రెడ్డి కంటే మా నాన్ననే మర్రి లక్ష్మణ్ రెడ్డి ముందు కాలేజీలు పెట్టాడు' అని తెలిపారు.