భారత్లో చమురు నిల్వలపై వాస్తవం వెలుగులోకి.. పది రోజులకు సరిపడా ఉంది: పెట్రోలియం శాఖ

భారత్లో చమురు నిల్వలపై వాస్తవం వెలుగులోకి.. పది రోజులకు సరిపడా ఉంది: పెట్రోలియం శాఖ

న్యూఢిల్లీ: భారత్లో చమురు నిల్వలపై కీలక వాస్తవం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇంధన నిల్వలపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొన్న తరుణంలో ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ఇండియా టుడే వివరణ కోరుతూ RTI పిటిషన్ దాఖలు చేసింది. ఈ RTI పిటిషన్ పై కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ స్పందించింది. ఇండియాలో వ్యూహాత్మక చమురు నిల్వలు మరో 9.5 రోజులకు.. అంటే దాదాపు పది రోజులకు సరిపడా ఉన్నాయని తెలిపింది.

ఇంధనం భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమని, పశ్చిమాసియా దేశాలు ప్రధాన వనరుగా కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సరఫరా నిరంతరత కోసం పలు దేశాలతో నిరంతర సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. హర్మూజ్ జలసంధి మార్గంలో చిక్కుకున్న భారత నౌకలు సురక్షితంగా తిరిగి చేరాయని వెల్లడించారు. దేశానికి 53 లక్షల మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, 41 దేశాల నుంచి ఇంధన దిగుమతులు జరుపుతున్నామని తెలిపారు.

ఆయిల్ కంపెనీల వద్ద పెట్రోల్, డీజిల్‌‌‌‌ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సౌత్‌‌‌‌ ఇండియా కన్సార్టియం ఆఫ్​ఇండియన్‌‌‌‌ పెట్రోలియం(సీఐపీడీ) జాయింట్‌‌‌‌ సెక్రటరీ -రాజీవ్‌‌‌‌ అమరం తెలిపారు. ఆయిల్​కంపెనీలు, డీలర్ల మధ్య జరుగుతున్న ఆర్థిక లావాదేవీల కారణంగా వచ్చిన సమస్య వల్లే నో స్టాక్​ బోర్డులు పెడ్తున్నారని చెప్పారు. కంపెనీలతో డీలర్ల సంఘం చర్చిస్తుందని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని.. వాహనదారులు భయాందోళన చెందొద్దని తెలిపారు.

►ALSO READ | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇరాన్ చర్చల పురోగతితో బుల్స్ జోరు

ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,200 పెట్రోల్‌‌‌‌ బంకులు ఉండగా, ఒక్క హైదరాబాద్‌‌‌‌లోనే 1,200కు పైగా ఉన్నాయి. సాధారణంగా రోజుకు 40 లక్షల నుంచి 70 లక్షల లీటర్ల వరకు పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ సరఫరా జరుగుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో డీలర్లు దాదాపు 25 శాతం వరకు కొనుగోళ్లు తగ్గించినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజుల క్రితం జిల్లాల్లో మొదలైన సమస్య క్రమంగా నగరానికి పాకింది. సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జనగామ లాంటి జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోని అంబర్‌‌‌‌పేట్‌‌‌‌, చిక్కడపల్లి, బంజారాహిల్స్‌‌‌‌, లంగర్‌‌‌‌హౌజ్‌‌‌‌, బోయిన్‌‌‌‌పల్లి, సికింద్రాబాద్‌‌‌‌, నాంపల్లి తదితర ప్రాంతాల్లో అనేక బంకులు మూతపడ్డాయి.

దీంతో స్టాక్​ఉన్న బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి క్యూల్లో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెట్రోల్‌‌‌‌ కొరత ఉందనే వదంతులు వ్యాపించడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరుగుతున్నది. ఇప్పటివరకు ట్రావెల్ కంపెనీలు, పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థలకు క్రెడిట్‌‌‌‌పై ఇంధనం అందించిన బంకులు ఇప్పుడు చేతులెత్తేయడంతో ఆ రంగాలపై కూడా ప్రభావం పడుతున్నది. ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌ సంస్థలు సైతం ఇంధనం కోసం ఇబ్బందులు పడుతున్నాయి.