Rajasthan Royals: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 2026, మార్చి 24న ఈ జట్టు కొత్త యాజమాన్యం చేతిలోకి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు మనోజ్ బదేలే నేతృత్వంలో ఉన్న ఈ ఫ్రాంచైజీని, కల్ సోమాని ఆధ్వర్యంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది. గతంలో సుమారు రూ. 320 కోట్లకు కొనుగోలు చేసిన ఈ జట్టు, ఇప్పుడు ఏకంగా రూ. 15,280 కోట్లకు అమ్ముడైంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.
పూర్తి స్థాయి కెప్టెన్‌గా:
యాజమాన్యంతో పాటు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ కూడా మారారు. గత సీజన్ వరకు కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్, ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లడంతో.. రాజస్థాన్ యాజమాన్యం రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. పరాగ్ గత సీజన్‌లో శాంసన్ అందుబాటులో లేనప్పుడు వైస్ కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించాడు. ఈసారి పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.
►ALSO READ | IPL 2026: ఐపీఎల్ కెప్టెన్ల కీలక సమావేశం.. కౌంట్‌డౌన్ స్టార్ట్!
జైస్వాల్ కి కెప్టెన్సీ పగ్గాలు:
సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌ను తొలగించి, యశస్వి జైస్వాల్‌ను నియమించనున్నట్లు వార్త కథనాలు వస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. రాజస్థాన్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ మార్పు గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2026, మార్చి 25 ముంబైలో జరిగిన ఐపీఎల్ కెప్టెన్ల ఫోటోషూట్‌లో కూడా రియాన్ పరాగ్ పాల్గొని, ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్, భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం పరాగ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాజస్థాన్ ఫ్రాంచైజీ జైస్వాల్‌ను రూ. 18 కోట్లకు, పరాగ్‌ను రూ14 కోట్లకు రిటైన్ చేసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ షెడ్యూల్:
రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ తమ ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది. అనంతరం ఏప్రిల్ 4, 7, 10 తేదీలలో వరుసగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లతో తలపడనుంది.
