IPL 2026: ఐపీఎల్ కెప్టెన్ల కీలక సమావేశం.. కౌంట్‌డౌన్ స్టార్ట్!

IPL 2026: ఐపీఎల్ కెప్టెన్ల కీలక సమావేశం.. కౌంట్‌డౌన్ స్టార్ట్!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ముంబైలో జరిగిన కెప్టెన్ల ఫోటోషూట్ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఐపీఎల్ 19 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా 10 ఫ్రాంచైజీలకు 10 మంది భారతీయ ఆటగాళ్లే సారథ్యం వహిస్తుండటం విశేషం. విదేశీ కెప్టెన్లు ఒక్కరు కూడా లేని ఫోటోను చూసి ఇండియన్ క్రికెట్ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. 

గత వారం వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక్కరే విదేశీ సారథిగా ఉండేవారు. కానీ వెన్నునొప్పి కారణంగా అతడు ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో, ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఐపీఎల్ 2026లో 'అందరూ భారతీయ' కెప్టెన్స్ ఉన్నట్లు అయింది. 

►ALSO READ | SRH vs RCB కాదురా.. కావ్య vs అనన్య మధ్యే అసలు మ్యాచ్!

గతంలో ఐపీఎల్ లోని పలు జట్లకు షేన్ వార్న్, గిల్‌క్రిస్ట్, వార్నర్ వంటి దిగ్గజ విదేశీ ప్లేయర్స్ సారథ్యం వహించేవారు. కానీ, గత 18 సీజన్లలో 15 సార్లు భారతీయ కెప్టెన్లే టైటిల్ గెలవడంతో ఫ్రాంచైజీల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. లోకల్ ఆటగాళ్లకు భారతీయ పిచ్‌లపై అవగాహాన, వ్యూహాలు రచించడంలోనూ స్వదేశీ కెప్టెన్లే మెరుగని ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి. గతేడాది రజత్ పటిదార్ సారథ్యంలో ఆర్‌సీబీ తొలి టైటిల్ నెగ్గడంతో ఈ నమ్మకానికి మరింత బలం చేకూర్చింది. ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు ఇంకా లీగ్‌లో ఆడుతున్నప్పటికీ, వారు కెప్టెన్లుగా లేకపోవడం గమనార్హం. దీంతో ఐపీఎల్‌లో  కొత్త తరం నాయకత్వం మొదలైందని చాటిచెబుతోంది. 

10 జట్ల కెప్టెన్లు: 
* రుతురాజ్ గైక్వాడ్– చెన్నై సూపర్ కింగ్స్
* రజత్ పటిదార్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
* హార్దిక్ పాండ్యా – ముంబై ఇండియన్స్
* రియాన్ పరాగ్ – రాజస్థాన్ రాయల్స్ 
* అజింక్య రహానే – కోల్ కతా నైట్ రైడర్స్
* ఇషాన్ కిషన్ – సన్‌రైజర్స్ హైదరాబాద్
* శుభ్‌మన్ గిల్ – గుజరాత్ టైటాన్స్
* రిషబ్ పంత్ – లక్నో సూపర్ జెయింట్స్ 
* శ్రేయస్ అయ్యర్ – పంజాబ్ కింగ్స్
* అక్షర్ పటేల్ – ఢిల్లీ క్యాపిటల్స్