IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్‌కు చెందిన డియాజియో గ్రూప్ నుంచి ఈ టీమ్ ని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా రూ.16,700 కోట్లకు దక్కించుకుంది. ఈ చారిత్రాత్మక డీల్‌తో ఆర్సీబీ బాధ్యతలను బిర్లా ఫ్యామిలీ చేపట్టింది. కుమార మంగళం బిర్లా తనయుడు ఆర్యమన్ బిర్లా ఛైర్మన్‌గాబాధ్యతలు స్వీకరించగా, అతడి సోదరి అనన్య బిర్లా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కావ్యమారన్, పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా ఎలా అయితే ఐకాన్‌గా మారిపోయారో.. ఇప్పుడు ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ అనన్య బిర్లా స్టాండ్స్‌లో ఉండి టీమ్ ని ఉత్సాహపరుస్తుందని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మాకు కూడా ఓ అందాల తార (అనన్య బిర్లా) వచ్చేసిందోరోయ్ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా అనన్య బిర్లా కేవలం ఓ పారిశ్రామికవేత్ర కూతురు మాత్రమే కాదు.. ఆమె 17 ఏళ్లలోనే స్వతంత్ర మైక్రోఫైనాన్స్ అనే సంస్థను స్థాపించి, గ్రామీణ మహిళలకు ఆర్థికంగా చేయూతనిస్తుంది. ప్రస్తుతం ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని పలు కీలక వ్యాపార బాధ్యతలను అనన్య చూసుకుంటుంది.
►ALSO READ | Virat Kohli: ఈసారి బౌలింగ్లో నా సత్తా చూపిస్తా: గ్రౌండ్లో భీకర ప్రాక్టీస్లో కోహ్లీ
అనన్య బిర్లా అంతర్జాతీయ స్థాయిలో పాప్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మ్యూజిక్ రంగంలో ఆమెకు వరల్డ్ వైడ్ గా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. మానసికఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు Mpower అనే స్వచ్ఛంద సంస్థను ఆమె నడుపుతున్నారు. గతంలో గుజరాత్ టైటాన్స్ కి సపోర్ట్ చేసిన అనన్య.. ఇప్పడు తన సొంత ఫ్యామిలీ జట్టు కావడంతో ఆర్సీబీ ప్రమోషన్లలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఆర్యమన్ బిర్లా వ్యూహకర్తగా వెనుక ఉంటే.. అనన్య బిర్లా జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి క్రికెట్ అభిమానులను అలరించబోతున్టన్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మైదానంలో అనన్య బిర్లా రాకతో ఐపీఎల్ మరింత కలర్‌ఫుల్‌గా మారడం ఖాయమని క్రీడా పండితులు సైతం జోస్యం చెబుతున్నారు. దీంతో అనన్య గురించి నెటిజన్లు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.
New RCB owner — Ananya Birla
— ᏰᏗᏝᏗ (@balakoteswar) March 24, 2026
Strong competitor for SRH’s Kavya Maran? 😀#RCB #Birla #IPL2026 #TATAIPL2026 https://t.co/D4Shte4Pq2 pic.twitter.com/l03LkiMqSB
