హస్మత్ పేటలో పార్క్ తీసేసి డంపింగ్ యార్డ్: స్థానికుల ఆందోళన

హస్మత్ పేటలో పార్క్ తీసేసి డంపింగ్ యార్డ్: స్థానికుల ఆందోళన

హైదరాబాద్ : ఓల్డ్ బోయిన్ పల్లి పరిధిలోని హస్మత్ పేటలో ఉన్న పార్క్ స్థాలాన్ని డంపింగ్ యార్డ్ గా మార్చుతుండడంతో స్థానిక ప్రజలు, బీజేపి నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే, కార్పోరేటర్ పై ధ్వజమెత్తారు.  హస్మత్ పేట పార్కు స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, ఇప్పుడు ఈ పార్కును స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహా యాదవ్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు తీసేశారన్నారుజ ఈ చెరువును మిని టాంక్ బండ్ గా తీర్చి దిద్దుతామని అనేక హామీలు ఇచ్చి, ఇపుడేమో మురికి కూపంగా మార్చడం, ఉన్న ఒక్క పార్కును డంపింగ్ యార్డ్ గా మార్చారన్నారు.

డంపింగ్ యార్డ్ గా మారిస్తే ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడడం జరుగుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదలే హస్మత్ పేట పరిసర ప్రాంతాలు రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయని.. చెరువును సుందరీకరించకపోవడం, చుట్టూ ఉన్న స్థలాలను కబ్జాలతో పాటు డంపింగ్ యార్డ్ లు మార్చడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైన అనాలోచితమైన నిర్ణయాలు మానుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవలన్నారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు  స్ధానికులు.