ఆవాల రైతుల అవస్థలు.. 2 కిలోమీటర్ల ట్రాక్టర్లు క్యూ

ఆవాల రైతుల అవస్థలు.. 2 కిలోమీటర్ల ట్రాక్టర్లు క్యూ

హర్యానాలో రేవారి మండి మార్కెట్​ యార్డు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు.  ఆవాలను విక్రయించేందుకు వచ్చిన రైతులు రెండు రోజులుగా ఆవాల ట్రాక్టర్లతో ఎప్పుడెప్పుడు కొంటారా అని ఎదురు చూస్తున్నారు.  క్యూలో ఉన్న రైతులు ఆకలితో మలమల మాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  రేవారి ధాన్యం మార్కెట్​ నుంచి రెండు కిలోమీటర్ల మేర ఆవాల లోడు వాహనాలతో రైతులు బారులు తీరారు. 

HAFED  ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు.  ప్రభుత్వం ప్రత్యమ్నాయ చర్యలు చేపట్టడంలో విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. తాము  ఏం చేయాలో అర్దం కాని పరిస్థితిలో ఉన్నామని ఆవాల రైతులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. HAFED సిబ్బంది సమ్మె కారణంగా  రైతులు బారులు తీరారు.  గత అర్దరాత్రి( మార్చి 26 )  నుంచి ఆవాల రైతులు క్యూలో ఉన్నా .. ఇప్పటి వరకు ( మార్చి 27 సాయంత్రం) తమ వంతు రాలేదన్నారు.  

HAFED ఉద్యోగుల సమ్మె వలన కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యంగా జరుగుతుందని మార్కెట్​ కార్యదర్శి నరేంద్ర యాదవ్​ తెలిపారు.  రైతులు ఇబ్బంది పడకుండా కంపెనీ ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.  మార్చి 25న రేవారి మండి మార్కెట్​ లో  62 మంది రైతులు 1130 క్వింటాళ్ల  ఆవాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎంఎస్‌పి రేటు రూ.5650  మార్కెట్ కార్యదర్శి నరేంద్ర యాదవ్ తెలిపారు.

 క్యూలో ఉన్నా... వెనక్కు తీసుకెళ్లినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆవాలనుఎండబెట్టాలని మార్కెట్​ కార్యదర్శి రైతులకు విఙ్ఞప్తి చేశారు.  ఒకటి రెండు రోజుల్లో  వ్యవస్థను రూపొందిస్తామన్నారు.  రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు.  ప్రస్తుతం ఆవపిండిలో 8 శాతం వరకు తేమ ఉందని... అంతకంటే ఎక్కువ ఉంటే  ఆవాలను కొనుగోలు చేయమన్నారు.  ఆవాలను ఎండబెట్టిన తరువాత విక్రయానికి తీసుకువరావాలని రైతులకు విఙ్ఞప్తి చేశారు. 

రైతులు ఇబ్బందులు పడుతున్నా మార్కెట్​ అధికారులు చర్యలు తీసుకోలేదని వాపోయారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పగలు పనిగంటలు పెంచాలని డిమాండ్ చేశారు.  ఆవాల ధాన్యం కొంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికి ఇంకా ( వార్త రాసే సమయానికి) అధికారిక ప్రకటన రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఉదయం 5 గంటలకు ఆవాల లోడుతో క్యూలో ఉన్నా... రాత్రి 10 గంటలకు  క్యూ తగ్గలేదన్నారు.  వాహనాలకు గేట్​ పాస్​ ఇచ్చే ప్రక్రియ కూడా ఆలస్యమవుతుందని.... ఆవాలను అమ్ముకొనేందుకు వాహనాలను డైరక్ట్​ గా లోపలికి అనుమతించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.