అక్కడ హనుమంతుడే డాక్టర్​... ఆ గుడికి వెళితే క్యాన్సర్​ కూడా తగ్గుతుందట

అక్కడ హనుమంతుడే డాక్టర్​... ఆ గుడికి వెళితే క్యాన్సర్​ కూడా తగ్గుతుందట

దేశంలో చాలా ఆచారాలున్నాయి.  కొంతమంది తాంత్రిక విద్యలతో బాధపడుతుంటే మరికొంతమంది  దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు.   క్యాన్సర్​ లాంటి భయంకరమైన వ్యాధి వచ్చిందంటే  పూర్తిగా కోలుకోవడం చాలా కష్టం... ఎన్ని మందులు వాడినా... ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఉపశమనమే కాని.. పూర్తిగా తగ్గడం ఉండదు.. కాని మధ్యప్రదేశ్​ లో ఓగుడికి  వెళ్తే చాలు.... రోగాలు మటుమాయమవుతాయట.   ఆగుడిని హనుమాన్​ క్లినిక్​ అని పిలుస్తారు.  అక్కడ సాక్షాత్తు ఆంజనేయస్వామి వైద్యం చేస్తాడని చెబుతున్నారు.. ఏంటీ ఆంజనేయ స్వామి వైద్యం చేయడం ఏమిటి అనుకుంటున్నారా... అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. . . .

హిందువులలో ఎంతోమంది ఆంజనేయ స్వామిని( Anjaneya Swamy ) ఎంతో భక్తితో పూజిస్తారనే సంగతి తెలిసిందే.ఆంజనేయస్వామి కోరిన కోర్కెలను తీరుస్తాడని చాలామంది ఫీలవుతారు. ప్రతి ఊరిలో దాదాపుగా హనుమంతునికి ఆలయం( Hanuman Temple ) ఉంటుంది. వేరే ఆలయం ఉన్నా హనుమంతుడి విగ్రహం తప్పకుండా ఉంటేంది. రామ భక్త హనుమాన్​ ను  పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయని చాలామంది నమ్ముతుంటారు.

మధ్యప్రదేశ్ లోని భిండ్‌లో దండ్రువా ధామ్ పేరుతో ఒక హనుమాన్ ఆలయముంది. ఈ గుడిని సందర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతో ప్రజలు వస్తుంటారు. ఇక్కడ ఆంజనేయస్వామిని డాక్టర్‌ బజరంగ్ బలిగా పూజిస్తారు.ఇక్కడ హనుమాన్ ఆలయాన్ని ఆస్పత్రిగా భావిస్తారు. హనుమంతుడిని డాక్టర్‌గా కొలుస్తారు. స్వామి వారిని దర్శించుకొని.. ఆయన పాదాల వద్ద ఉన్న నీరు తాగితే.. క్యాన్సర్ వంటి రోగాలు కూడా తగ్గుతాయట. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని  భక్తులు విశ్వసిస్తారు.

మన దేశంలో దాదాపు ప్రతి గ్రామంలోనూ హనుమాన్ గుడి ఉంటుంది. కోట్లాది మంది భక్తులు ఆయన్ను ఆరాధిస్తారు.. ఎప్పుడు భయంగా అనిపించినా.. బజ్‌రంగ బలిని తలచుకుంటారు. హనుమంతుడు అంత పవర్‌ఫుల్ అని భక్తులు విశ్వసిస్తారు.  దండ్రువా ధామ్‌కి వచ్చి హనుమంతుడిని దర్శించుకుంటే.. పెద్ద పెద్ద వ్యాధులు కూడా నయమవుతాయని ఆలయ పూజారులు, భక్తులు చెబుతారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి మహమ్మారి కూడా తగ్గుందని విశ్వసిస్తారు.ఇక్కడికి నిత్యం ఎంతో మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వస్తుంటారు. 

హనుమంతుడి పాదాల వద్ద నుంచి నీళ్లు తీసుకెళ్తారు. ఈ నీటిని తాగడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా నయమవుతాయట. రోగులకు స్వయంగా హనుమంతుడే వైద్యం చేస్తాడని భక్తులు నమ్ముతారు.భక్తి శ్రద్ధలతో ఆలయానికి వస్తే ఎంతటి పెద్ద రోగమైనా నయమవుతుందని స్థానికులు తెలిపారు. అన్ని రకాల రోగాలకు హనుమంతుడు చికిత్స చేస్తారని.. అందుకే ఈ గుడిని డాక్టర్ హనుమాన్ క్లినిక్‌గా అభివర్ణిస్తుంటారు. వరుసగా ఐదు మంగళవారాలు డాక్టర్ హనుమాన్ దగ్గర ధ్యానం చేసి.. అక్కడ ఇచ్చే నీళ్లు తాగితే క్యాన్సర్ తగ్గుతుందట. గతంలో హనుమంతుడు స్వయంగా తన భక్తుడికి వైద్యం చేయడానికి వైద్యుడి రూపంలో వచ్చాడని ప్రతీతి. అందుకే ఇక్కడ హనుమంతుడిని డాక్టర్ గా పూజిస్తారు.

మొండి వ్యాధులతో తరచూ బాధ పడేవాళ్లు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదని చెప్పవచ్చు.భక్తి శ్రద్ధలతో ఈ ఆలయంలోని దేవుడిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.తక్కువ ఖర్చుతోనే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించే అవకాశం అయితే ఉంది