ఆదిలాబాద్‌టౌన్/జగిత్యాల టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలో శనివారం ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుడి రథయాత్ర వైభవంగా నిర్వహించారు. స్థానిక వినాయక్‌చౌక్‌లోని శ్రీ గోపాలకృష్ణ మఠం నుంచి ప్రారంభమైన శోభయాత్ర పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ రథయాత్రకు ఆదిలాబాద్పట్టణంతో పాటు సమీప గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఎస్పీ అఖిల్‌మహాజన్, ఎమ్మెల్యే పాయల్‌శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
