- సెంచరీతో కదం తొక్కిన మిచెల్ మార్ష్
- రాయల్స్‌కు వరుసగా రెండో ఓటమి
- పలుమార్లు వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం
లక్నో: సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ విశ్వరూపం ప్రదర్శించింది. గురువారం ఎకానా స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో లక్నో భారీ స్కోరు సాధించింది. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మార్ష్ కేవలం (56 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 111) పరుగులు చేశాడు. నికోలస్పూరన్(23 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్‌తో 38) రాణించాడు. చివర్లో కెప్టెన్ రిషబ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్) మెరుపులు తోడవడంతో లక్నో 3 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. కానీ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం టార్గెట్‌ను 213గా నిర్ణయించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరగడంతో ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో పాటిదార్ (31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 61), టిమ్ డేవిడ్(17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), పడిక్కల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌యాదవ్33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో ఆర్సీబీ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేసింది. లక్నో 9 పరుగులతో గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ' ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ' మిచెల్ మార్ష్ కు దక్కింది.
సెంచరీతో అలరించిన మార్ష్
టాస్ఓడి బ్యాటింగ్ చేపట్టిన లక్నోకు ఓపెనర్లు మిచెల్‌మార్ష్, కులకర్ణి శుభారంభాన్నిచ్చారు. మార్ష్'అటాకింగ్' చేయగా కులకర్ణి నిలకడగా ఆడాడు. హేజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతిని మార్ష్సిక్స్ కొట్టాడు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ఆగిపోయింది. కొద్దిసేపటికి ప్రారంభం కావడంతో అదే ఓవర్‌ఐదో బంతిని మళ్లీ సిక్స్‌గా మలిచాడు. ఆర్సీబీ బౌలర్లందరినీ మార్ష్ఊచకోత కోశాడు. సిక్స్‌లు, ఫోర్లతో స్టేడియంలో పరుగుల వరద పారించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. దీంతో లక్నో పవర్ ప్లే ముగిసేసరికి వికెట్కోల్పోకుండా 68 పరుగులు చేసింది. అనంతరం కులకర్ణి (17) పాటిదార్‌కు క్యాచ్ఇచ్చి వెనుదిరిగాడు. ఓపెనర్లు ఇద్దరూ కలిసి 56 బంతుల్లో 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో మొదటి 10 ఓవర్లు ముగిసేసరికి లక్నో ఒక వికెట్కోల్పోయి 98 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్, మార్ష్‌తో జతకట్టాడు. ఆర్సీబీ ఫీల్డర్లను, బౌలర్లను పరుగులు పెట్టిస్తున్న మార్ష్49 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. హేజిల్‌వుడ్ వేసిన 16 ఓవర్ మొదటి బంతిని జాకబ్బెతెల్కు క్యాచ్ఇచ్చి మార్ష్(56 బంతుల్లో111) అవుటయ్యాడు. మార్ష్, పూరన్ కేవలం 41 బంతుల్లో 70 పరుగులు జోడించారు. అనంతరం సలామ్దార్ వేసిన 18 ఓవర్లో కృనాల్‌కు క్యాచ్ ఇచ్చి పూరన్(23 బంతుల్లో 38) వెనుదిరిగాడు. ఇదే ఓవర్లో కెప్టెన్ రిషబ్ పంత్(10 బంతుల్లో32) మూడు, నాలుగు బంతులను ఫోర్లు కొట్టగా చివరి బంతిని సిక్స్‌గా మలిచాడు. దీంతో లక్నో నిర్ణీత 19 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. కృనాల్, హేజిల్‌వుడ్, రసిక్సలాం తలా ఒక వికెట్ తీశారు. కాగా వర్షం కారణంగా ఆటను 19 ఓవర్లకు కుదించారు.
ఆదిలోనే ఎదురుదెబ్బ
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మహ్మద్‌షమీ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి బెతెల్(4) ప్రిన్స్యాదవ్కు క్యాచ్ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం ప్రిన్స్బౌలింగ్లో విరాట్‌కోహ్లీ బోల్డ్అయ్యాడు. దీంతో ఆర్సీబీ 2ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది. ఓపెనర్లు అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన దేవదత్పడిక్కల్, కెప్టెన్రజత్పాటిదార్ఆచితూచి ఆడడం మొదలెట్టారు. చెత్త బంతులను ఫోర్లు, సిక్స్‌లుగా మలుస్తూ నిలకడగా ఆడారు. పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. అనంతరం ఇద్దరు ధాటిగా ఆడడం ప్రారంభించారు. ఈ క్రమంలో పాటిదార్26 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. మొదటి 10 ఓవర్లకు ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఇదే క్రమంలో ప్రిన్స్‌యాదవ్ బైలింగ్‌లో అతడికే క్యాచ్ఇచ్చి పడిక్కల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) అవుటయ్యాడు. అనంతరం ఇదే ఓవర్లో జితేశ్శర్మ (1) వెంటనే అవుటయ్యాడు. షహబాజ్వేసిన 12 ఓవర్లో మార్కమ్స్కు క్యాచ్ ఇచ్చి పాటిదార్(31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 61) పెవిలియన్‌చేరాడు. పాడిక్కల్, పాటిదర్కలిసి 53 బంతుల్లో 95 పరుగుల భాగస్వామ్య్యం నెలకొల్పారు.
ఆశలు రేపిన టిమ్‌డేవిడ్
ఒక దశలో టిమ్‌డేవిడ్ వేగంగా ఆడడం ప్రారంభించాడు. వరుసగా సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగాడు. మయాంక్వేసిన 15 ఓవర్లో 17 పరుగులు రాబట్టాడు. అనంతరం షహబాజ్బౌలింగ్లో భారీ షాట్‌కు యత్నించిన టిమ్(17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40) దిగ్వేశ్కు క్యాచ్ఇచ్చి వెనుదిరిగాడు. ఆర్సీబీ విజయానికి చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా కృనాల్ (28), షెఫర్డ్ (23) జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. దిగ్వేశ్వేసిన ఈ ఓవర్లో కేవలం 10 పరుగులు మాత్రమే వస్తాయి. దీంతో ఆర్సీబీ 19 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో లక్నో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు సమష్టిగా రాణించి గెలిశారు.
సంక్షిప్ల స్కోరు:
లక్నో: 19 ఓవర్లలో డక్వర్త్ప్రకారం 213/3
( మిచెల్‌మార్ష్111, పూరన్38, పంత్32)
బెంగళూరు: 19 ఓవర్లలో 203/6 (పాటిదార్61, టిమ్‌డేవిడ్40, ప్రిన్స్‌యాదవ్33/3)
