దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అతని నుండి సుమారు 20 లక్షల ఖరీదైన ఎయిర్‌గన్స్, టెలిస్కోప్, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతన్ని అరెస్టు చేశారు. కస్టమ్స్‌కు ఎలాంటి డిక్లరేషన్ లేకుండా గ్రీన్ ఛానల్ గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని అధికారులు అడ్డుకున్నారు. అతని లగేజీలో పది ఎయిర్ గన్స్, గన్స్‌కు వాడే టెలిస్కోప్ సైట్స్, ఇతర సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతని వద్ద సరైన డాక్యుమెంట్లు లేవని తేలింది. కస్టమ్స్ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్న వస్తువులను అధికారులు సీజ్ చేశారు. అంతకుముందు జూలై 14న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ విభాగం వియత్నాం నుంచి వచ్చిన భారతీయ జంటను అరెస్టు చేసి వారి బ్యాగుల్లోని రూ.22 లక్షల కంటే ఎక్కువ విలువైన 45 తుపాకులను స్వాధీనం చేసుకుంది.
UP | Customs at CCSI Airport in Lucknow seized 10 Air Guns, telescopic sights & misc. arms accessories worth Rs 20.54 lakhs from a passenger coming from Dubai on July 19. Passenger arrested & will be produced before Chief Judicial Magistrate (EO) for judicial custody pic.twitter.com/nCAziq7XIZ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 20, 2022
