కోలీవుడ్ స్టార్ అజిత్‌కు టాలీవుడ్‌లోనూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో రియల్ స్టంట్స్ చేయడానికే ఆయన ఇష్టపడతారు. బైక్ రేసర్‌గా ఎన్నో స్టంట్స్ చేసిన ఆయన.. ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘విదా ముయార్చి’ మూవీ కోసం రిస్కీ స్టంట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ గతేడాది నవంబర్‌లో ఫారిన్‌లో చిత్రీకరించారు. ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో అజిత్ డూప్ లేకుండా నటించడంతో ఆయనకు ప్రమాదం జరిగింది.
దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాత సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తన పక్కన గాయాలతో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు అజిత్ ఫాస్ట్‌గా కార్ డ్రైవ్ చేస్తూ కనిపించారు. అతివేగంతో వెళ్తున్న కారు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి అజిత్ చిన్నగాయాలతో బయటపడ్డారు. ఈ వీడియోను షేర్ చేసిన లైకా సంస్థ ‘ధైర్యానికి హద్దులు లేవు. ఎలాంటి డూప్ లేకుండా డేరింగ్ స్టంట్ చేసిన అజిత్ కుమార్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్’ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ నటిస్తున్న 62వ చిత్రమిది. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్స్. సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.