నిర్మాత మోహన్ వడ్లపడ్ల దర్శకుడిగా రూపొందించిన చిత్రం ‘ఎమ్ ఫర్ ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). ఒడిశా సూపర్ స్టార్ సంబీట్ ఆచార్య, అమెరికన్ హీరోయిన్ జో శర్మ జంటగా రూపొందిన ఈ మూవీని పాన్ ఇండియా వైడ్‌గా మే 8న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘విడుదలకు ముందే మా సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడటం గర్వకారణం. ప్రీమియర్‌కు మంచి స్పందన లభించింది. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అని అన్నారు.
