హైదరాబాద్, వెలుగు : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ విభాగం నూతన సభ్యుడిగా హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ సత్తార్ నియమితులయ్యారు.
దక్కన్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్ కు ఉపాధ్యక్షుడిగా, దేశ్ కా సహారా ఉర్దూ పత్రిక సంపాదకులుగా ఆయన పని చేస్తున్నారు. కౌన్సిల్ నూతన కార్యవర్గంలో దక్షిణ భారత్ నుంచి అబ్దుల్ సత్తార్ ఒక్కరినే నియమించారు.
