'మా' ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్

'మా' ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA)ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవాళ (శుక్రవారం) విడుదలైంది. అక్టోబర్‌ 10న (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి  ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

ఎన్నికల్లో 8 మంది ఆఫీస్‌ బేరర్స్‌, 18మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ కోసం జరిగే ఈ ఎన్నికలకు ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు.  ఈనెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల(అక్టోబర్) 1-2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఉంటుంది. అక్టోబర్ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్‌ 10న ఎన్నికలు.. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు. 

మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, సీవీఎల్ నరసింహారావు, మంచు విష్ణు పోటీలో దిగుతున్నారు.