సూర్యకుమార్ యాదవ్.. డేంజరస్ ప్లేయర్

సూర్యకుమార్ యాదవ్.. డేంజరస్  ప్లేయర్

టీమిండియా డాషింగ్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్పై ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సిరీస్లో సూర్యకుమార్ అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. రాబోయే వరల్డ్ కప్లో అతను డేంజరస్ ప్లేయర్ అని డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్లో తాము హార్దిక్ను కట్టడి చేయాలని ప్లాన్స్  వేశామని..అవి వర్కౌట్ అయ్యాయన్నాడు. అయితే సూర్య మాత్రం అదరగొట్టాడని చెప్పాడు. అతని టాలెంట్ ముందు బౌలర్లు ఓడిపోయారన్నాడు.

జడేజాకు అక్షరే సరైన రిప్లేస్మెంట్..
టీ20 సిరీస్‌కు జడేజా గాయం కారణంగా దూరమైన సమయంలో భారత్ బలహీనపడుతుందని అనుకున్నట్లు మెక్ డొనాల్డ్ చెప్పాడు. అయితే అక్షర్ రూపంలో భారత్కు నిఖార్సైన ఆల్ రౌండర్ దొరికాడని చెప్పుకొచ్చాడు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించాడని తెలిపాడు. మూడు మ్యాచుల్లో అక్షర్ ..ప్రధాన వికెట్ టేకర్గా నిలిచాడని మెచ్చుకున్నాడు. మూడు మ్యాచుల్లో 8 వికెట్లు తీయడమే కాకుండా..కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. 

ఆసీస్ బౌలింగ్ ఎటాక్ సరిపోలేదు..
ఈ సిరీస్లో టీమిండియా బ్యాట్స్మన్ అద్భుతంగా ఆడారని మెక్ డొనాల్డ్ అన్నాడు. భారత బ్యాట్స్మన్ నైపుణ్యానికి ఆసీస్ బౌలింగ్ ఎటాక్ సరిపోలేదన్నాడు. డెత్ ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు మెరుగ్గానే బౌలింగ్ చేసిందన్నాడు. కానీ కొన్ని సార్లు బ్యాట్స్మన్ నైపుణ్యం ముందు బౌలర్ల ఫ్లాన్స్ పనిచేయవని చెప్పుకొచ్చాడు.

సూర్య ధనాధన్ ఇన్నింగ్స్..
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ దుమ్మురేపాడు. 187పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించడంలో సూర్యకుమార్ కీలకపాత్ర పోషించాడు.  కోహ్లీతో కలిసి 104పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసీస్ బౌలర్లను సిక్సులు, ఫోర్లతో ఉతికారేశాడు. 36 బంతుల్లోనే 69పరుగులు చేశాడు. ఈ విజయంతో  భారత్ 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.