మధిరలో సీఎం కప్పు పోటీలు ప్రారంభం

మధిరలో సీఎం కప్పు పోటీలు ప్రారంభం

మధిర, వెలుగు: మధిర నియోజకవర్గ స్థాయి సీఎం కప్పు టోర్నమెంట్ గురువారం మధిర ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. మధిర రూరల్ సీఐ రమేష్ మధిర విద్యాశాఖ అధికారి ప్రభాకర్ క్రీడాకారులు పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని,ముదిగొండ, మండలాల నుండి క్రీడాకారులు 700 మంది హాజరయ్యారు. మొదటి రోజు క్రీడలు విజయవంతంగా జరిగాయి.

కబడ్డీ పురుషులు విభాగం మొదటి బహుమతి ఎర్రుపాలెం మండలం, రెండవ బహుమతి మధిర, కబడ్డీ బాలికల విభాగం మొదటి బహుమతి మధిర, రెండవ బహుమతి ఎర్రుపాలెం, ఖో ఖో మొదటి బహుమతి బాలురు విభాగం మధిర, రెండవ బహుమతి ఎర్రుపాలెం, బాలికల విభాగం ఖో ఖో మొదటి బహుమతి మధిర, రెండవ బహుమతి ఎర్రుపాలెం, వాలీబాల్ బాలురు విభాగం మొదటి బహుమతి చింతకాని, రెండవ బహుమతి మధిర, బాలికల విభాగం మొదటి బహుమతి మధిర, రెండవ బహుమతి చింతకాని విజేతలుగా నిలిచారు.

6 న షటిల్, క్యారమ్, చెస్, అద్లెటిక్సు, కరాటే, యోగ,పోటీలు నిర్వహించడం జరుగుతుందని, మొత్తం 700 మంది క్రీడాకారులు, 50 మంది అధికారులు పాల్గొన్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ వై.చిన్ని తెలిపారు. ఈ కార్యక్రమం వై రామారావు, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, మారాబత్తుల జమలయ్య, శ్రీనివాస్ రావు, చైతన్య, బి. శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, క్రిష్ణా రావు, నాగేశ్వరావు,రవికుమార్, మాదవ రావు, రవి, నరసింహ రావు, తదితరులు పాల్గొన్నారు