భోపాల్‌లో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఎంఐఎం ప్రయత్నాలు

 భోపాల్‌లో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఎంఐఎం ప్రయత్నాలు

2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు భోపాల్‌లో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఎంఐఎం ఇప్పట్నుంచే ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. అందులో భాగంగా ఆ పార్టీ బిర్యానీ ఫెస్ట్‌లను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌లో ఏఐఎంఐఎం పార్టీ లక్ష మందికి పైగా సభ్యత్వాన్ని పొందిందని ఎఐఎంఐఎం నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫీట్‌కు చాలా మంది వెళుతున్నారని, అతిథి దేవో భవ కింద రుచికరమైన బిర్యానీని అందిస్తున్నామన్నాని ఎంఐఎం నాయకుడు, అభ్యర్థి పీర్జాదా తౌకిర్ అన్నారు. నరేలాలో 25 వేల మందికి పైగా సభ్యులు చేరారని పార్టీ పేర్కొంది. ఒక్క భోపాల్ లోనే 40మంది ముస్లిం వర్గానికి చెందిన నరేలా ప్రజలు దాదాపు 25వేల మంది పీర్జాదా తౌకిర్ నిజామీ తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంఐఎం నుండి 10 లక్షల మందికి పైగా సభ్యులను చేర్పించమే తమ కర్తవ్యమని నిజామీ తెలిపారు. ప్రజలు ఉత్సాహంగా ఓవైసీ వద్దకు వస్తున్నారని, తాము కూడా బిర్యానీ విందులు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇండియాలో ఓవైసీ తర్వాత ఆ స్థాయిలో ఫేమసైన హైదరాబాదీ బిర్యానీని వారికి అందిస్తున్నామని నిజామీ చెప్పారు. తొలి ఎన్నికల్లోనే పట్టణ ప్రాంతాల్లో విజయం సాధించడంపై ఒవైసీ మద్దతుదారులు ఉత్కంఠగా ఉన్నారన్న ఆయన... అదే సమయంలో కాంగ్రెస్‌లో టెన్షన్ పెరిగిందని తెలిపారు. 2023 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 50 స్థానాల్లో పోటీ చేసేందుకు ఏఐఎంఐఎం సిద్ధమవుతోంది. భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, ఖాండ్వా, ఖర్గోన్ మరియు బుర్హాన్‌పూర్ వంటి నగరాల్లో, ఆ పార్టీ పోటీదారులు కూడా తీవ్రంగా పని చేయడం ప్రారంభించారు.