క్లాస్ రూమ్ లో హిజాబ్ ధరించి నమాజ్

క్లాస్ రూమ్ లో హిజాబ్ ధరించి నమాజ్

భోపాల్: మధ్యప్రదేశ్​లోని హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్సిటీ క్లాస్ రూమ్​లో ఓ ముస్లిం స్టూడెంట్ హిజాబ్ ధరించి నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. దీనిపై హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో వర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించారు. వీడియో క్లిప్​తో పాటు ఫిర్యాదు అందిందని వర్సిటీ రిజిస్ట్రార్ సంతోశ్ సహగౌరా శనివారం మీడియాకు తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆ కమిటీ మూడ్రోజుల్లో రిపోర్టు ఇస్తుందని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, వర్సిటీ క్యాంపస్​లో స్టూడెంట్లు ప్రత్యేకంగా యూనిఫామ్ ధరించాలనే రూలేమీలేదని వర్సిటీ మీడియా రిలేషన్స్ ఆఫీసర్ వివేక్ జైస్వాల్ తెలిపారు. కానీ, తప్పనిసరిగా బేసిక్ ఎథికల్ డ్రెస్సింగ్ ఫాలో కావాల్సి ఉంటుందన్నారు. మంచ్ నేతలు మాట్లాడుతూ ఇలాంటి మతపరమైన పద్ధతులను విద్యాసంస్థల్లో అనుమతించకూడదన్నారు. ఆ అమ్మాయి చాలారోజులుగా హిజాబ్​తోనే క్లాసులకు వస్తోందని మండిపడ్దారు. క్లాస్ రూమ్​లలో హిజాబ్, తలపాగా ధరించొద్దని కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును వారు గుర్తుచేశారు.