ఇకపై పిల్లలకు పుస్తకాల మోత తప్పినట్టే..!

ఇకపై పిల్లలకు పుస్తకాల మోత తప్పినట్టే..!

వారంలో ఒకరోజు పిల్లలు స్కూల్ కి బ్యాగ్ లేకుండా రావచ్చని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోవు విద్యా సంవత్సరం 2024 - 25 నుండి ఈ రూల్ అమలులోకి రానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా అక్కడి పిల్లలకు పుస్తకాల మోత తప్పినట్లు అవుతుంది. ఈ రూల్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్కూల్ బ్యాగుల బరువు విషయంపై కూడా లిమిట్స్ పేర్కొంది.

1, 2వ తరగతుల విద్యార్థులు బ్యాగ్ బరువు 1.6కేజీల నుండి 2.2కేజీల వరకు, 3 నుండి 5వ తరగతి విద్యార్థుల బ్యాగ్ బరువు 1.7 నుండి 2.5కేజీల వరకు, 6 నుండి 8 తరగతుల విద్యార్థులు బ్యాగ్ బరువు 2.5కేజీల నుండి 4కేజీల వరకు, 9,10వ తరగతుల విద్యార్థులు బ్యాగ్ బరువు 4.5కేజీలు మించి ఉండకూడదని నిర్ణయించింది.

11, 12తరగతుల విద్యార్థులు బ్యాగ్ బరువు విషయంలో ఆయా స్ట్రీమ్ ని బట్టి స్కూల్ యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం పిల్లల్లో ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ రూల్ దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.